డిసెంబర్ లో విడుదలకు సిద్ధమవుతున్న ‘47డేస్’

47-days-movie-will-release-in-december-2018

సత్యదేవ్, పూజా ఝవేరీ, రోహిణి ప్రకాష్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం ’47డేస్’ ద మిస్టరీ అన్ ఫోల్డ్స్ అనేది ఉపశీర్షిక. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దగ్గర దర్శకత్వం శాఖలో పనిచేసిన ప్రదీప్ మద్దాలి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. టైటిల్ కార్డ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దబ్బార శశిభూషణ్ నాయుడు, రఘు కుంచే ,శ్రీధర్ మక్కువ,,విజయ్ శంకర్ డొంకాడ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మూవీ డిసెంబర్ నెలలో విడుదలకు సిద్దమవుతుంది. అవుట్ పుట్ తెలిసిన త్రిశూల్ సినిమా ఫ్యాన్సీ రేట్ కు ఓవర్ సీస్ హక్కులు దక్కించుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ ముఖ్య కథాంశంగా వస్తున్నా.. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు చాలా ఇంట్రెస్టింగా ఉంటాయని యూనిట్ అంటోంది. కాగా ఈ చిత్రానికి రఘు కుంచే సంగీతం సమకూర్చారు.

Also read : న్యాయం జరిగేలా చూసేందుకు రంగంలోకి దిగిన బాలకృష్ణ