జగన్ ఎపిసోడ్ అంతా ఓ సినిమా : మంత్రి ఆదినారాయణ రెడ్డి

జగన్ ఎపిసోడ్ అంతా ఓ సినిమా క్రియేషన్ లా ఉందని అన్నారు ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి. జగన్ తీరును దగ్గరగా ఉండి చూసిన వ్యక్తిగా తానీ ఈ మాట చెబుతున్నానని అన్నారు. ఇక కేంద్ర సహకారం లేకున్నా.. కడప స్టీల్ ఫ్యాక్టరీ ఒక్క నెలలో 15 వందల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తుందని అన్నారాయన. రాయల స్టీల్ అథారిటీని ఏర్పాటు చేయటంపై సంతోషం వ్యక్తం చేశారు. వెనుకబడిన జిల్లాలో కడప కూడా ఉందన్నారు. అయితే..కేంద్రం నిధులు ఇవ్వటం లేదని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు.