చిన్నారి ప్రాణం తీసిన బడి బస్సు


బడి బస్సు మరో చిన్నారిని బలి తీసుకుంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని చిల్లకల్లు తక్షశిల స్కూల్‌లో LKG చదువుతున్న షేక్‌ బాషా.. బస్సు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. వత్సవాయి మండలం భీమవరం గ్రామానికి చెందిన భాష.. ఉదయం ఉల్లాసంగా స్కూల్‌కు వెళ్లాడు. కానీ.. దురదృష్టం వెంటాడింది. సాయంత్రానికి విగతజీవిగా మారాడు. సాయంత్రం స్కూల్ బస్సు కింద పడి చనిపోయినట్టు భాష తల్లిదండ్రులకు సమాచారం అందింది. కన్నీరు మున్నీరైన పేరెంట్స్.. బంధువులతో కలిసి స్కూల్ ముందు ఆందోళనకు దిగారు.