ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో సింధూకు రజత పతకం

badminton-world-championships-pv-sindhu-lose-carolina-marin-final

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధూకు రజత పతకం దక్కింది. స్పెయిన్‌ క్రీడాకారిణి కరోలినా మారిన్‌ చేతిలో సింధు ఓటమి చెందింది. మొదట్లో పోరాటపటిమ చూపిన సింధు ఆ తరువాత నిరాశపరిచింది. మొదటి గేమ్‌ను 21-19 తేడాతో సొంతం చేసుకున్న మారిన్‌ రెండో గేమ్‌లో మరింత చెలరేగిపోయింది. మారిన్‌ దూకుడు ముందు సింధు నిలవలేక పోయింది. ఇక మైదానంలో చెలరేగిన మారిన్‌ రెండో గేమ్‌ను 21-10తేడాతో సొంతం చేసుకుంది. దీంతో ప్రపంచ చాంపియన్‌షిప్‌ విజేతగా స్పెయిన్‌ నిలిచింది. భారత క్రీడాకారిణి పీవీ సింధు రజత పతకంతో సరిపెట్టుకుంది.

-ADVT-